తెలంగాణకు భారీ వర్ష సూచన ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 17 August 2023

తెలంగాణకు భారీ వర్ష సూచన !


బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు రాష్ట్రంవైపుకు దట్టమైన మేఘాలు విస్తరిస్తుండటంతో ఐఎండీ రాష్ట్ర ప్రజలకు వర్ష సూచన జారీ చేసింది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది. అదే సమయంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈసారి వాతావరణం పూర్తి భిన్నంగా కన్పిస్తూ అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. జూలైలో ఆలస్యంగా వర్షాలు మొదలైనా కుండపోతగా కురవడంతో లోటు కాస్తా తీరిపోయింది. మళ్లీ ఆగస్టు నెలలో వర్షపాతం లోటు కన్పిస్తోంది. గత 4 రోజుల్నించి అయితే పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు భరించలేని ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని సూచించడం ఊరటనిస్తోంది. ఆగస్టు 20 వరకూ అంటే మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ సందర్భంగా కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్ధిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇవాళ్టి నుంచి పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. రేపటి నుంచి భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, నిజమాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. 

No comments:

Post a Comment