బండ్-ఈ-అమీర్ పార్కులోకి మహిళలకు ప్రవేశం నిషిద్ధం !

Telugu Lo Computer
0


ఫ్ఘనిస్థాన్ లోని ప్రధానమైన జాతీయ పార్కుల్లో ఒకటైన బండ్-ఈ-అమీర్ పార్కులోకి మహిళలకు ప్రవేశం లేదని ఆదేశించారు. దీనిపై ఆ దేశ ధర్మం మరియు దుర్గుణం శాఖ మంత్రి మొహమ్మద్ ఖలీద్ హనాఫీ మాట్లాడుతూ మహిళలు సైట్ సీయింగ్ కు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. మహిళలను పార్కులోకి వెళ్లకుండా మత పెద్దలు, సెక్యూరిటీ సంస్థలు అడ్డుకోవాలని చెప్పారు. అంతేకాకుండా కొందరు మహిళలు హిజాబ్ వేసుకోవడం లేదని, కొందరు హిజాబ్ ధరించినా దానిని సరిగా వేసుకోవడం లేదని తమకు ఫిర్యాదుల వస్తున్నాయని, ఇక అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మహిళలకు పార్క్ లోకి ఎంట్రీని నిషేధించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటి వరకు మహిళలను చదువుకు, ఆటకు, ఉద్యోగాలకు దూరం చేసి వారి స్వేచ్ఛను హరించారని, ఇప్పుడు ఏకంగా వారిని ప్రకృతి నుంచి కూడా దూరం చేయడం దారుణమంటున్నారు. బండ్-ఈ-అమీర్ పార్క్ అత్యంత సుందరంగా ఉంటుంది. ఇందులో ఎన్నో సరస్సులు, ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలు, ప్రకృతి సహజమైన అందాలు ఉన్నాయి. ఈ పార్క్ ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ గా పేరుగాంచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)