రాబోయే ఎన్నికలలో మీ మిషన్‌ గందరగోళానికి గురవుతుంది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 25 August 2023

రాబోయే ఎన్నికలలో మీ మిషన్‌ గందరగోళానికి గురవుతుంది !


'దేశంలోని ప్రజలు అంతరిక్షంలోకి మిషన్లను పంపే పనిలో బిజీగా ఉన్నారు. మిషన్‌ అంతా బాగానే ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం సూర్యుడి పైకి కూడా మిషన్‌ పంపిన మాకు పర్వాలేదు. కానీ రాష్ట్రంలో ఉల్లిపాయల సమస్యపై కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం. లేకపోతే రాబోయే ఎన్నికలలో మీ మిషన్‌ గందరగోళానికి గురవుతుంది. దానిని మీరు గ్రహించలేరు' అని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఎద్దేవా చేశారు. ఈ నెల 19వ తేదీన ఉల్లి ఎగుమతులపై కేంద్రం 40శాతం సుంకం విధించింది. ఉల్లి ఎగుమతులపై కేంద్రం విధించిన అధిక సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ, మద్దతు ధరకు నాఫెడ్‌ కొనకపోవడాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర రైతులు నిరసనకు దిగారు. మరోవైపు రాష్ట్రంలో ఉల్లి సేకరణ కేంద్రాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే విజ్ఞప్తి చేశారు. క్వింటాల్‌కు రూ.2,410 ధరతో 2 లక్షల టన్నుల ఉల్లిని కొంటామని రైతులకు కేంద్రం హామీ ఇచ్చింది. ఇప్పటిదాకా 13 కేంద్రాల ద్వారా 500 టన్నులే సేకరించింది. దీంతో సేకరణ కేంద్రాలను పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. 

No comments:

Post a Comment