టమాటా తోటకు సీసీ కెమెరాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 8 August 2023

టమాటా తోటకు సీసీ కెమెరాలు !


హారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాకు చెందిన శరద్‌ రావత్‌ అనే రైతు టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లకుండా పొలానికి రక్షణగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాడు. టమాటాలకు అధిక ధర పలకడంతో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. అందుకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. అందుకు రూ. 22 వేలు వెచ్చించినట్లు తెలిపాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో టమాటా ధర కేజీ రూ.160 ఉంది. చాలా రోజుల నుంచి దేశంలో టమాటాలు చోరీకి పాల్పడుతున్న విషయం తెలిసిందే. సోమవారం కర్ణాటకలోని కోలారు నుంచి రాజస్థాన్‌లోని జైపుర్ కు వెళ్లున్న టమాటా లోడు అదృశ్యమైంది. అందులో సుమారు రూ. 21 లక్షల విలువైన టమాటాలు ఉన్నాయి. మరో ఘటనలో ఝార్ఘండ్‌ కూరగాయల మార్కెట్‌లో 40 కిలోల టమాటాలను దొంగిలించారు.

No comments:

Post a Comment