సలాం కొట్టలేదని యువకునిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 29 August 2023

సలాం కొట్టలేదని యువకునిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి !

జార్ఖండ్ లోని ధన్‌బాద్‌లో కాంగ్రెస్ నాయకుని కుమారుడు వెళ్లే క్రమంలో నమస్కారం చేయలేదని 17 ఏళ్ల ఆకాశ్ చందల్‌పై దాడి చేశారు. కారులో బలవంతంగా ఎక్కించి విపరీతంగా కొట్టారు. అనంతరం ఓ టీషాపు వద్దకు తీసుకెళ్లి మళ్లీ దాడి చేశారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. తాను ట్యూషన్‌కు వెళ్లి వచ్చే క్రమంలో దాడి జరిగిందని చెప్పాడు. తాను ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిలబడగా, ఐదు కార్లు తమ ముందుగా వెళ్లాయని తెలిపాడు. ఇంతలో కారులోంచి రణ్‌వీర్ సింగ్ దిగి తనకు నమస్కారం పెట్టమని వేధించారు. సలాం కొట్టడానికి నిరాకరించగా, కారులోకి ఎక్కించుకుని కొట్టారని చెప్పాడు. ఓ బాడీగార్డు తనను పట్టుకెళ్లి రణ్‌వీర్ సింగ్ పాదాల వద్ద పడేశాడని పోలీసులకు తెలిపాడు. ఈ దాడిపై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు రణ్‌వీర్ సింగ్‌కు ఆ గొడవకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నంలోనే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా ఆయన పేర్కొన్నారు. అందులో తన కొడుకు ఉన్నట్లు ఎ‍క్కడా ఆధారాలు కూడా లేవని చెప్పారు. వీడియోపై దర్యాప్తు చేయాలని అన్నారు. 

No comments:

Post a Comment