హేమంత్‌ సోరెన్‌కి ఈడీ సమన్లు !

Telugu Lo Computer
0


జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను భూకుంభకోణం కేసు వెంటాడుతోంది. తాజాగా ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీచేసింది. ఆగస్టు 14వ తేదీన తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. అంతకుముందు.. అక్రమ మైనింగ్ కేసులోనూ హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు విచారించారు. 2022 నవంబర్ 18న విచారణకు పిలిచి.. పలు ప్రశ్నలు సంధించారు. ఇదే కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. 2022, మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి పూజా సింఘాల్‌ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో హేమంత్ సోరెన్ పాల్గొన్న విషయం తెలిసిందే. విపక్షాల కూటమి ఇండియాలోనూ హేమంత్ సోరెన్ పార్టీ మద్దతుగా ఉంది. గత నెలలో బెంగళూరులో జరిగిన సమావేశంలోనూ హేమంత్ పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)