ప్రధానికి 40 మంది మణిపూర్‌ ఎమ్మెల్యేల లేఖ !

Telugu Lo Computer
0


ణిపూర్‌లో సంపూర్ణ స్థాయి నిరాయుధీకరణ జరగాల్సి ఉందని, అప్పుడే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నెలకొనే పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్రానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తెలిపారు. ఏ వర్గానికి కూడా అక్రమ ఆయుధాలు అందకుండా చూడాల్సి ఉందని తెలియచేస్తూ ఈ ఎమ్మెల్యేల బృందం ప్రధాని మోడీకి ఓ లేఖ పంపించింది. ప్రత్యేకించి బాధితులైన మైతీ తెగలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ లేఖపై సంతకాలు చేశారు. కుకీ మిలిటెంట్లతో కుదిరిన రాజీ ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేలు తెలిపారు. వారి పట్ల అణచివేత చర్యలను నిలిపివేస్తూ ఇంతకు ముందు కుదిరిన ఒప్పందం వల్ల చాలా అనర్థాలు చోటుచేసుకున్నాయని, వారికి అత్యధిక సంఖ్యలో అక్రమంగా ఆయుధాలు అందడం వల్లనే పరిస్థితి దిగజారిందని ఎమ్మెల్యేల బృందం తెలిపింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు వెంటనే ఎన్‌ఆర్‌సిని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకురావాలి. నిర్ణయాధికారపు జిల్లా మండళ్లు (ఎడిసిలను) బలోపేతం చేయాలని ఈ లేఖలో తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)