తొమ్మిదేళ్లలో రూ. 100 లక్షల కోట్ల అప్పు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 August 2023

తొమ్మిదేళ్లలో రూ. 100 లక్షల కోట్ల అప్పు !


ఇండియా చేస్తున్న అప్పుల విలువ రోజు రోజుకు పెరిగిపోతోంది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశంలో గత 9 ఏళ్ల కాలంలో రూ. 100 లక్షల కోట్ల అప్పు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 67 ఏళ్లల్లో చేసిన దానికంటే ఇది ఎక్కువగా ఉందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అప్పులు పెరిగిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ర్టాలు పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయని పదే పదే చెబుతున్న కేంద్రం. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని విమర్శిస్తున్నాయి. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 14 మంది ప్రధానమంత్రులు పాలించారు. వారందరూ కలిసి 67 ఏండ్లలో రూ.55.87 లక్షల కోట్లు అప్పు చేయగా.. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ 9 ఏళ్లల్లో రూ. 100 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినట్టు అధికారిక లెక్చలు వెల్లడిస్తున్నాయి. 2014కు ముందు కేంద్రం ఏటా రూ.83 వేలకోట్ల అప్పు చేస్తే. మోదీ వచ్చాక నెలకే రూ.93 వేల కోట్లకుపైగా అప్పులు చేస్తున్నారు. అర్థం పర్థం లేని ఆర్థిక విధానాలతో దేశం వందేండ్ల వెనక్కు వెళ్లిందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ స్థూల జాతీయోత్పత్తిలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఎప్పుడో దాటేసిందని అర్థమవుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం అప్పులు రూ.105 లక్షల కోట్లు. అప్పటికి జీడీపీలో కేంద్రం చేసిన అప్పులు 52 శాతం. 2020-21వ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం అప్పులు రూ.122 లక్షల కోట్లు. ఆ ఏడాదికి జీడీపీలో అప్పులు 61 శాతంగా ఉన్నాయి. 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం చేసిన అప్పులు 9 శాతానికిపైగా పెరిగాయి. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మొత్తం అప్పులు రూ.155.6 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం చూస్తే జీడీపీలో దేశం చేసిన అప్పు 58 శాతానికి పెరిగిపోయింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కంటే 18 శాతం ఎక్కువగా కేంద్రం అప్పులు చేసేసింది.


No comments:

Post a Comment