10 కంపెనీల బలగాలను ఆగమేఘాల మీద తరలింపు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 6 August 2023

10 కంపెనీల బలగాలను ఆగమేఘాల మీద తరలింపు !


ణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అదనంగా 10 కంపెనీల బలగాలను ఆగమేఘాల మీద రాష్ట్రానికి పంపింది. ఆదివారం వేకువజామునాటికే వాళ్లంతా మణిపూర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి స్థానిక అధికారుల సూచన మేరకు వివిధ జిల్లాలకు వెళ్లారు. కేంద్రం పంపించిన బలగాల్లో సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ దళాలకు చెందిన వారున్నారు. శనివారం బిష్ణుపుర్‌ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను క్వాక్టా ప్రాంతానికి చెందిన మైతేయ్‌ వర్గీయులుగా గుర్తించారు. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడటంతో శుక్రవారమే వాళ్లంతా ఇళ్లకు చేరుకున్నారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నవారిపై దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆగ్రహించిన మైతేయ్‌ వర్గీయులు కుకీ వర్గానికి చెందిన ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలుండటంతో కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దించింది. మే 3న మైతేయ్‌, కుకీ వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అక్కడి హింసాత్మక పరిస్థితులు పెచ్చుమీరుతుండటంతో కేంద్ర రక్షణశాఖ, హోంశాఖ దాదాపు 40 వేల మంది ఆర్మీ, పారామిలటరీ దళాలతోపాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్‌) రాష్ట్రంలో మోహరించింది. దీంతో అక్కడక్కడా ఘర్షణలు తలెత్తినా.. హింస చోటు చేసుకోవడం తగ్గింది. తాజాగా ముగ్గురు మైతేయ్‌ వర్గానికి చెందిన వారిని కాల్చి చంపడంతో కేంద్రం మరోసారి భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోవైపు కొన్ని మహిళా సంస్థలు భద్రతా బలగాల కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని సీఏపీఎఫ్‌ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర బలగాలను అడ్డుకునేందుకు తరచూ రోడ్లు బ్లాక్‌ చేస్తున్నారని, అందువల్ల విధినిర్వహణ కష్టమవుతోందని తెలిపింది.

No comments:

Post a Comment