రద్దీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్ కారు !

Telugu Lo Computer
0


బెంగళూరు రోడ్లపై డ్రైవర్ లేకుండా నడుస్తున్న ఓ వింత ఆకారంలో ఉన్న వాహనం స్థానికుల్నిఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేదో బాలీవుడ్ మూవీలో కారు ఆకారంలో ఉన్న వాహనంలా ఉందని ఓ యూజర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆన్‌ ద స్ట్రీట్స్‌ ఆఫ్ బెంగళూరు అనే క్యాప్షన్‌ను జతచేసి పోస్టు చేశాడు. ఈ కారును చూసిన నెటిజన్లు ఇదేంటీ ఇలా ఉందని? ప్రశ్నించారు. డ్రైవర్ లేకుండా ఎలా ఇంత ట్రాఫిక్‌లో నడుస్తోందని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కారుని జీప్యాడ్‌ అని అంటారని ఓ యూజర్ క్లారిటీ ఇచ్చాhttps://t.me/offerbazaramzonన్ కెమెరాలతో ట్రాఫిక్‌లోనూ నడుస్తోంది. ఈ కారులో మొత్తం 6 కెమెరాలు అమర్చారు. వీటి సాయంతో చుట్టూరా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తుంది. ప్రమాదం అనిపిస్తే వెంటనే వాహనం నిలిచిపోతుంది. ట్రాఫిక్‌ సమస్యను, రోడ్డు ప్రమాదాలను తగ్గించటంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు మైనస్‌ జీరో తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)