అద్దెకు ఇల్లు కావాలంటే ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి !

Telugu Lo Computer
0


బెంగళూరు వంటి సిటీల్లో అద్దెకు ఇల్లు దొరకడం ఎంత కష్టమో తెలిపే సంఘటన ఇది. బిట్స్​పిలానీ పూర్వ విద్యార్థి, హంగర్​ బాక్స్​ కో ఫౌండర్​ నీరజ్​ తనకు ఎదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నాడు. ఓ ఇంటి యజమాని తనను ఇంటర్వ్యూ చేశాడని తెలిపాడు. గంటపాటు తన ఆర్థిక పరిస్థితి తన స్టార్టప్​ డీటెయిల్స్​, తన భార్య లింక్డ్​ఇన్​ ప్రొఫైల్​ చెక్​ చేసి ప్రశ్నలు సంధించాడని తెలిపాడు. ఇంత చేసినా చివరకు ఈ ఇంటి కోసం మరో ఇద్దరు వెయిటింగ్​ లిస్టులో ఉన్నారని, వారిని కూడా ఇంటర్వ్యూ చేసి రెండు రోజుల్లో చెప్తానని పంపేశాడట. అంతే కాదు, బిజినెస్​ ఎలా నడపాలో కూడా టిప్స్​ ఇచ్చినట్టు పేర్కొన్నాడు. ఈ పరిస్థితి చూశాక బెంగళూరులో రూం కావాలంటే.. ముందుగా ఎదురయ్యే సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇలా అయితే ఐటీ నగరంలో బతకడం ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)