మహిళా రైతులతో సోనియా డ్యాన్స్‌

Telugu Lo Computer
0


తన నివాసానికి వచ్చిన రైతులతో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కలిసి డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ పంచుకోగా వైరల్‌గా మారింది. ఈ నెల 8న రాహుల్‌గాంధీ హర్యానాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సోనీపత్‌ జిల్లా మదీనా గ్రామంలో మహిళా రైతులుఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని చూడాలని కోరారు. దాంతో రాహుల్‌ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారిని సోనియా నివాసానికి ఆహ్వానించారు. మహిళా రైతులను సోనియా కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే గాక, సోనియా, ప్రియాంక గాంధీ కూడా మహిళలతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. మహిళా రైతులు సోనియాను నృత్యం చేయాలని కోరగా, అందుకు ఆమె అంగీకరించి వారితో కలిసి కాలుకదిపారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ నేత ఒకరు పంచుకుంటూ ఇది స్వచ్ఛమైన సంతోషం అని రాసుకోచ్చారు. హర్యానాలో రైతులతో సమావేశమైన వీడియోను రాహుల్‌గాంధీ పంచుకున్నారు. 'మన దేశంలోని రైతులు ఎంతో నిజాయితీ, సున్నిత మనస్తత్వం కలిగిన వారు. వాళ్లు పడే కఠిన శ్రమ గురించి తెలుసు. వారి అభిప్రాయాలను అర్థం చేసుకుంటే, దేశంలోని ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చు' అని రాహుల్‌ పేర్కొన్నారు. వీడియోలో ఓ మహిళా రైతు.. 'మేము ఢిల్లీలోని మీ ఇంటిని చూడాలనుకుంటున్నాం' అని కోరారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. 'నాకు ఇల్లు లేదు.. ప్రభుత్వం నా ఇంటికి తీసుకుంది' అని చెప్పారు. అనంతరం వారిని తన తల్లి సోనియా నివాసానికి ఆహ్వానించారు. అనర్హత వేటుతో లోక్‌సభ సభ్యత్వం రద్దవడంతో రాహుల్ గాంధీ తన నివాసాన్ని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)