మరో చీతా మృతి

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌ లోని కునో జాతీయ పార్కులో రెండు రోజుల క్రితమే మగ చీతా 'తేజస్‌' మృత్యువాతపడగా నేడు 'సూరజ్‌' అనే మరో మగ చీతా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు నెలల వ్యవధిలో ఈ పార్కులో మృతి చెందిన చీతాల్లో ఇది ఎనిమిదోది కావడం గమనార్హం. దీన్ని నమీబియా నుంచి తీసుకొచ్చారు. అయితే, సూరజ్‌ మృతికిగల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. 'ప్రాజెక్ట్ చీతా'లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నమీబియా నుంచి తీసుకొచ్చిన 'సాశా' అనే ఆడ చీతా మార్చి 27న, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 'ఉదయ్‌' అనే మగ చీతా ఏప్రిల్‌ 23న మృత్యువాతపడ్డాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఆడ చీతా 'దక్ష' మే 9న మృతి చెందింది. అదే నెలలో 'జ్వాల' అనే చీతాకు పుట్టిన నాలుగు కూనల్లో మూడు చనిపోయాయి. ఈ నెలలో రెండు మరణాలతో కలిపి.. మొత్తం 4 నెలల వ్యవధిలో చీతాల మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)