సిరాజ్ దెబ్బకు విండీస్ విలవిల !

Telugu Lo Computer
0


రెండో టెస్టుపై టీమ్‌ఇండియా పట్టుబిగించింది. మూడో రోజు కాస్త దూకుడుగా ఆడిన విండీస్‌కు అడ్డుకట్టవేసింది. ఫస్ట్​ ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 255 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఫలితంగా 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 181/2 వద్ద డిక్లేర్‌ చేసి ప్రత్యర్థి జట్టు ముందు 365 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ భారీ లక్ష్యఛేదనలో నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది విండీస్​. ఆ జట్టు విజయానికి ఇంకా 289 పరుగులు అవసరం. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (16), బ్లాక్‌వుడ్ (20) క్రీజులో కొనసాగుతున్నారు. నిలకడగా ఆడుతున్న క్రెయిగ్ బ్రాత్‌వైట్ ( 52 బంతుల్లో 28; 5 ఫోర్లు), కిర్క్‌ మెకంజీలను(0) అశ్విన్‌ తన వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 229/5తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విండీస్ జట్టు.. .. 7.4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ (5/60) ఆ జట్టుపై విరుచుకుపడ్డాడు. చివరి నాలుగు వికెట్లు అతడు తీసినవే కావడం విశేషం. ఆట ప్రారంభం అవ్వగానే.. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అథనేజ్‌(37) ఆరో వికెట్​గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జేసన్‌ హోల్డర్‌(15).. జోసెఫ్‌, కీమర్‌రోచ్‌ (4), కీమర్‌రోచ్‌ (4), గాబ్రియెల్‌ (0)లను పెవిలియన్‌కు పంపాడు​. దీంతో ఆతిథ్య జట్టు ఆలౌట్ అయింది.

https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)