మోడీజీ దేశ ప్రజలందరిలో ప్రేమ, ప్రశాంతత తిరిగి తీసుకొస్తాం !

Telugu Lo Computer
0


విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ  చేసిన విమర్శలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. తమను ప్రధాని మోడీ ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చని కానీ తాము మాత్రం మణిపూర్ గాయం మానేందుకు సాయపడతామని, అల్లర్లతో అట్టుడికిన రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడతామని అన్నారు. విపక్షాలను మోడీ ఏ పేరుతోనైనా పిలవచ్చు..మోడీజీ మేము ఇండియా..! దేశ ప్రజలందరిలో ప్రేమ, ప్రశాంతత తిరిగి తీసుకొస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈస్టిండియా కంపెనీ వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. విపక్షాలు ఇండియా అని పేరుపెట్టుకుంటే మోడీ  ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. పట్నా, బెంగళూర్‌లో ప్రతిపక్షాలు విజయవంతంగా సమావేశాలు నిర్వహించడంతో బీజేపీలో వణుకు మొదలైందని అన్నారు.విపక్షాలు ఏకం కావడంతో ప్రధానికి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ అల్లర్లపై మాట్లాడాలని తాము ప్రధాని నరేంద్ర మోడీని కోరితే ఏం మాట్లాడాలి..ఏం చేయాలనే దానిపై ప్రధానికి పాలుపోవడం లేదని అన్నారు. మణిపూర్ ఘటనలపై పార్లమెంట్ వెలుపల మాట్లాడిన మోడీ పార్లమెంట్ లోపల ఈ విషయంపై సమగ్ర చర్చ చేపట్టి అక్కడి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వివరించాలని ఖర్గే డిమాండ్ చేశారు. మణిపూర్ వ్యవహారాన్ని రాజస్ధాన్‌, చత్తీస్‌ఘఢ్‌, పశ్చిమ బెంగాల్ వంటి బీజేపేయేతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలతో పోల్చలేమని చెప్పారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ మణిపూర్ అల్లర్లు ఆందోళన రేకెత్తిస్తాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి కాషాయ పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)