కుమారుడి అరెస్టును నిరసిస్తూ కారు బానెట్ పైకి ఎక్కిన మహిళ !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ నార్సింగ్ పూర్ పరిధిలోని గోటేగావులో తన కుమారుడిని రక్షించుకోవడానికి ప్రయత్నిచిన ఓ తల్లి ఆవేశంలో బానెట్ పైకి ఎక్కింది. పోలీసులు ఆమెను అలాగే 500 మీటర్ల దూరం తరలించడం సంచలనం సృష్టించింది. స్థానికంగా ఒక వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొన్ని గంటల్లోనే ఇది వైరల్ గా మారింది. కుమారుడి అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె కారు బానెట్ ఉండగానే కారుని అలా ముందుకు పోనిచ్చారు. వివరాల లోకి వెళితే గోటేగంలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది అన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేస్తున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకడు సోను కహర్. అతని ఇంట్లో మూడు లక్షల విలువైన డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని తల్లి రోడ్లు పక్కన పూలు అమ్ముతూ పోలీసులు కొడుకుని అరెస్టు చేయడాన్ని చూసింది. ఆందోళనకు గురైన ఆమె వేగంగా పరిగెత్తుకొచ్చి కారు బానెట్ పైకి దూకింది. కుమారుడిని వదిలేయమని కోరుతూ అక్కడే కూర్చుంది. పోలీసులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఆమె వినలేదు. కుమారుడిని వదిలే వరకు తను దిగబోనని చెప్పింది. దీంతో పోలీసులు కారును  ముందుకు పోనిచ్చారు. ఆమె బానేట్ పై ఉంటుండగానే పోలీసులు అర కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. కేసు దర్యాప్తు చేయాలని డిప్యూటీ ఎస్పీని ఆదేశించారు. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా ఘటనకు కారణమైన ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆరోపణలు రోజువైతే నిందితులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)