వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివాహం !

Telugu Lo Computer
0


హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లా కోట్‌ఘర్‌ ప్రాంతానికి చెందిన ఆశిష్‌ సింఘాకు, కులు జిల్లాలోని భుంతార్‌ ప్రాంతానికి చెందిన శివానీ ఠాకూర్‌కు పెళ్లి జరిపించాలని కొద్ది రోజుల క్రితం పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు తలెత్తాయి. దీంతో రాష్ట్రంలో వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. అలానే, కులు ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో వధూవరులు కులులో పెళ్లి మండపానికి చేరుకోలేకపోయారు. దీంతో ఆన్‌లైన్‌లో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశిష్‌, శివానీల వివాహం జరిపించారు. ఈ ఆన్‌లైన్‌ పెళ్లికి వధూవరుల కుటుంబసభ్యులతోపాటు మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్‌ కూడా హాజరయ్యారు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వెనకడుగు వేయకుండా ముహూర్త సమయానికి పెళ్లి జరిపించడంపై కుటుంబసభ్యులతోపాటు కొత్త జంటపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)