హిమాచల్ ప్రదేశ్ లో చిక్కుకున్న 2000 మంది టూరిస్టులు తరలింపు

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలోని కాసోల్ ప్రాంతంలో చిక్కుకున్న సుమారు 2000 మంది టూరిస్టులను రక్షించారు. వాళ్లను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుకు తెలిపారు. కులు-మనాలీ రోడ్డును మంగళవారం సాయంత్రం తెరిచారు. ఆ రూట్లో సుమారు 2200 వాహనాలు వెళ్లినట్లు తెలిపారు. మనాలీలో ఇంకా అనేక ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. టూరిస్టులు తమ కుటుంబసభ్యులతో ఫోన్ మాట్లాడలేకపోతున్నారు. మనాలీ లెఫ్ట్ బ్యాంక్ రూట్లో రోడ్డును తెరిచారు. దక్షిణం వైపున ఉన్న రోడ్డు నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాసోల్‌-బుంతార్ రోడ్డు వైపు కూలిన కొండచరియల్ని తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. టూరిస్టు ప్రాంతమైన లాహోల్‌లో చిక్కుకున్న వాహనాలను కూడా తరలించినట్లు సీఎం తెలిపారు. సుమారు 300 వెహికిల్స్ అక్కడ నుంచి వెళ్లినట్లు చెప్పారు. కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి సమాచారాన్ని తెలుసుకుని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నట్లు ఏఎస్పీ ఆశిశ్ శర్మ తెలిపారు. ఆహారం, తాగునీరును అందిస్తున్నట్లు చెప్పారు. వరదల వల్ల చిక్కుకుపోయిన టూరిస్టులకు హోటళ్లు, టూరిజయం యూనిట్లు ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నాయి. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆరు హెలికాప్టర్లు రంగంలోకి దిగినట్లు సీఎం తెలిపారు. వరదల వల్ల రాష్ట్రానికి దాదాపు 4 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)