మొహర్రం ఊరేగింపులో విద్యుత్ షాక్‌కి నలుగురు బలి !

Telugu Lo Computer
0


జార్ఖండ్‌లో మొహర్రం వేడుక ఊరేగింపుకు వెళ్తున్న సమయంలో హైటెన్షన్ వైర్ తగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన బొకారో జిల్లాలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెతర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖెత్కో గ్రామంలోని ముస్లీంలు ఒక విగ్రహాన్ని తయారుచేసి ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ విగ్రహం హైటెన్షన్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా మంటలు వచ్చి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో 10 మంది గాయపడినట్లు బొకారో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియదర్శి అలోక్ తెలిపారు. 'శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ముహర్రం ఊరేగింపు కోసం ఇనుముతో భారీగా తయారుచేసిన జెండా.. 11,000 వోల్ట్ హై-టెన్షన్ విద్యుత్ తీగతో తాకింది' అని ఎస్పీ తెలిపారు. గాయపడిన వారందరినీ సమీపంలోని బొకారో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ అలోక్ తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)