ఢిల్లీ ప్రజలపై కేంద్రం కుట్ర !

Telugu Lo Computer
0


ర్యానా నుంచి వచ్చే వరద నీటితో ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మర్లెనా అన్నారు. హత్నికుండ్ బ్యారేజీ నుండి ఢిల్లీ, హర్యానా, యూపీ మూడు ప్రాంతాలకు నీరు వెళ్లే అవకాశం ఉన్నా కేవలం ఢిల్లీకి మాత్రమే మళ్లిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఢిల్లీలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నప్పటికీ.. ఒక్క చుక్క నీటిని కూడా హర్యానా, యూపీకి ఎందుకు మళ్లించలేదని ప్రశ్నిచారు. యూపీ, హర్యానా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ పాలనలో ఉన్నందుకేనా అని అతిషి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది ఢిల్లీ ప్రజలపై చేసిన కుట్రే అని ఆమె అన్నారు. దీనికి బీజేపీ కచ్చితంగా సమాధానం చెప్పాలని అతిషి డిమాండ్ చేశారు. ప్రస్తుతం యమునా నదిలో వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. ఉదయం 10 గంటల వరకు 205.95 మీటర్లకి చేరింది. వరద నీరు చేరడంతో ఢిల్లీలో మూడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను గత మూడు రోజుల క్రితం మూసివేశారు. దాంతో ఢిల్లీ ప్రజలు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. పరిస్థితులు కాస్తా మెరుగుపడడంతో ఇప్పటికే ఓక్లా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునరుద్దరించగా.. ఇవాళ ఉదయం నుంచి చంద్రావాల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా తిరిగి ప్రారంభించారు. మరొక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ‎ను కూడా పునరుద్ధరిస్తే ఢిల్లీ వాసుల నీటి కష్టాలు తప్పనున్నాయి. యమునా నది వరద తగ్గడంతో యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ ‎కు రాకపోకలు పునరుద్ధరించారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)