మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి ఇండియా కూటమి నిర్ణయం ?

Telugu Lo Computer
0


26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇండియా కూటమి పార్టీల సమావేశంలో అవిశ్వాస తీర్మానం అంశంపై చర్చించారు. మణిపూర్ హింసపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఇండియా డిమాండ్ చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా మల్లికార్జున్ కార్గే ఛాంబర్‌లో జరిగిన ఇండియా కూటమి సమావేశలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే మార్గాలపై చర్చించారు. అవిశ్వాస తీర్మానం ద్వారా మణిపూర్ హింస సహా అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని విపక్ష నేతలు భావిస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)