ఆనంద్‌ మహీంద్రా కలావంతీ కోట గురించి ట్విట్ !

Telugu Lo Computer
0


నంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వ్యాపార లావాదేవీలతో ఎంతో బిజీబిజీగా ఉన్నప్పటికీ తరచూ సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన ప్రతిపోస్టు ఆసక్తికరంగానో, స్ఫూర్తిదాయకంగానో, గుండెల్ని పిండేసే విధంగానో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా, ఆయన మహారాష్ట్రలోని కలావంతీ కోట గురించి ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఆ కోట ఎక్కాలని ఉందంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. మన దేశంలోనే ఉన్నా ఈ ప్రాంతం గురించి ఇప్పటి వరకు తనకు తెలియదని ఆనంద్‌ మహీంద్రా చెప్పుకొచ్చారు. ఈ ట్రెక్కింగ్‌ పశ్చిమ కనుమల్లోనే అత్యంత భయంకరమైనదని, దాదాపు 60 డిగ్రీ ఏటవాలులో ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, ఈ సవాల్‌కు తన శరీరం సహకరిస్తుందో లేదో చూడాలన్నారు. ఎవరో వ్యక్తి ఆ కోట నుంచి కిందికి దిగుతుండగా తీసిన వీడియోను ఆనంద్‌ మహీంద్రా పోస్టు చేశారు. దీనిపై పలువురు యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. చాలా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. 'మార్గం నిటారుగా కనిపిస్తోంది. బహుశా అది కెమెరా వల్ల కూడా కావొచ్చు. ఎవరైనా వెళ్లాలనుకుంటే కచ్చితంగా మంచి షూ ధరించి వెళ్లండి' అని సలహా ఇస్తున్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)