ఇథనాల్, విద్యుత్ ఉపయోగిస్తే పెట్రోల్ లీటర్ రూ.15 లకే లభిస్తుంది !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రూ.5600 కోట్ల విలువైన 11 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే మొత్తం 219 కి.మీ. పొడవుతో రూ.3,775 కోట్ల వ్యయంతో నిర్మించిన నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులను నితిన్‌ గడ్కరీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లీటర్ పెట్రోల్ రూ. 15కే లభించాలంటే వాహనదారులు పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ను ఉపయోగించాలని సూచించారు. వాహనాలకు ఇంధనం కోసం వాహనదారులు సగటున 60 శాతం ఇథనాల్, మరో 40 శాతం విద్యుత్ ను ఉపయోగిస్తే పెట్రోల్ లీటర్ రూ. 15కే లభిస్తుందని చెప్పారు. వాహనాలకు ఇథనాల్, విద్యుత్ ఉపయోగించడం వల్ల కాలుష్యంతో పాటు దేశంలో పెట్రోల్, డీజిల్ దిగుమతులు భారీగా తగ్గుతాయని, త్వరలో వీటి రేట్లు కూడా దిగివస్తాయన్నారు. వీటి ద్వారా భారత ప్రభుత్వానికి దాదాపు రూ. 16 లక్షల కోట్లు మిగులుతాయని, ఈ నగదు అంతా రైతుల ఖాతాల్లోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)