సబ్ మెరైన్ శబ్దాలను గుర్తించిన విమానం !

Telugu Lo Computer
0


అంట్లాంటిక్ సముద్రం అడుగులో ఉన్న టైటానిక్ శిథిలాలను చూడడానికి వెళ్లిన మినీ సబ్ మెరైన్ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ మినీ సబ్ మెరైన్ లో ఐదుగురు ఉన్నారు. గల్లంతైన సబ్ మెరైన్ కోసం అమెరికా, కెనడా దేశాలు గాలిస్తున్నాయి. ఈ గాలింపులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సముద్రం నీటి అడుగులు సబ్ మెరైన్ శబ్దాలను గర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ బుధవారం వెల్లడించంది. కెనడాకు చెందిన పీ-3 నిఘా విమానం ఈ శబ్దాలను పసిగట్టినట్లు పేర్కొంది. 30 నిమిషాలకు ఒకసారి.. దాదాపు 4 గంటల పాటు శబ్దాలను గుర్తించినట్లు ప్రకటించింది. దీంతో అమెరికా తన గాలింపు బృందాలను అక్కడి చేర్చింది. అక్కడ జరిగిన గాలింపు చర్యల్లో ఎలాంటి పురగోతి సాధించలేదని తెలుస్తోంది. అయినా గాలింపు కొనసాగిస్తున్నట్లు నార్త్‌ఈస్ట్‌ కమాండ్‌ తెలిపింది. కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి దాదాపు 400 మైళ్ల దూరంలో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. మినీ సబ్ మెరైన్ కోసం US, కెనడియన్ కోస్ట్ గార్డ్ నౌకలు, విమానాలు 7,600 చదరపు మైళ్లు (20,000 చదరపు కిలోమీటర్లు) విస్తిర్ణంలో సముద్రంలో వెతుకుతున్నాయి. గల్లంతైన మనీ సబ్ మెరైన్ లో బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ ఉన్నారు. వీరితో పాటు ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్‌టన్ రష్, ఫ్రెంచ్ సబ్‌మెరైన్ ఆపరేటర్ పాల్-హెన్రీ నార్గోలెట్ ఉన్నారు. ఈ మినీ సబ్ మెరైన్ లో ఇంకా 30 గంటలకు సరిపడ మాత్రమే ఆక్సిజన్ ఉంది. ఆలోపు వారిని గుర్తిస్తే ప్రాణాలతో కాపాడొచ్చని నిపుణులు చెబుతున్నారు. టైటానిక్ 1912లో తన తొలి ప్రయాణంలో మంచుకొండను ఢీకొట్టి అట్లాంటిక్‌ సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ మునిగిపోవడంతో 1,500 మందికి పైగా మరణించారు. ఓడ శిథిలాలు 1985లో అట్లాంటిక్ మహాసముద్రం దిగువన గుర్తించారు

Post a Comment

0Comments

Post a Comment (0)