ఫడ్నవీస్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ ఖండన !

Telugu Lo Computer
0


కొల్హాపూర్ ఘర్షణల నేపధ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ఔరంగజేబు వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. నాథూరామ్ గాడ్సే, వామన్ శివరామ్ ఆప్టేల సంతానం ఎవరో వారికి తెలుసా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ పోస్టులను కొందరు స్టేటస్‌గా పెట్టుకోవడంతో కొల్హాపూర్‌లో ఇరు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన నేపధ్యంలో ఫడ్నవీస్ వ్యాఖ్యలను ఓవైసీ తప్పుపట్టారు. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో హఠాత్తుగా ఔరంగజేబు కొడుకులు పుట్టుకొచ్చారు.  వారు ఔరంగజేబు స్టేటస్ పెట్టుకుని వారి పోస్టర్స్ చూపుతుండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఔరంగజేబు కొడుకులు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చారు. దీని వెనుక ఎవరున్నారని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఫడ్నవీస్ వ్యాఖ్యలను ఓవైసీ ఆక్షేపిస్తూ మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఔరంగజేబు సంతానం గురించి మాట్లాడుతున్నారు. మీకు అంతా తెలుసా? మీకు అంత పరిజ్ఞానం ఉందని నేననుకోను. మరి గాడ్సే, ఆప్టేల సంతానం ఎవరో మీకు తెలుసా? వారు ఎవరని నిలదీశారు. కాగా, కొల్హాపూర్ అల్లర్లపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు. యూపీ తరహాలో సంఘ విద్రోహ శక్తులను కాల్చిపారేయాలని ఆయన పేర్కొన్నారు. జూన్ 6న ఇద్దరు వ్యక్తులు టిప్పు సుల్తాన్ ఫొటోతో పాటు ఆడియో మెసేజ్‌ను సోషల్ మీడియా స్టేటస్‌గా పెట్టుకోవడం ఘర్షణలకు దారితీయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. గత పదేండ్లుగా మతపరమైన రాజకీయాలు ప్రబలంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిత్యం ప్రమాదంలో పడుతున్నదని అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట ఎంతలా మసకబారిందో తెలుస్తోందని దుయ్యబట్టారు. ఇక అంతకుముందు కొల్హాపూర్ ఘర్షణలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు.కొందరు వ్యక్తులు చేసిన పని ఈ పరిస్ధితికి దారితీయడం దురదృష్టకరమని అన్నారు. ఇది సమాజానికి మంచిది కాదని, అల్లర్ల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)