కోతులను తరిమేందుకు రైతులు ఎలుగుబంటి వేషం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులు కోతులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కోతులు చెరుకు రైతులను తీవ్ర అవస్థల పాలు చేస్తున్నాయి. చెరకు పంటను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు స్థానిక రైతులు ఒక మార్గాన్ని కనుగొన్నారు. స్వయంగా ఎలుగుబంటి దుస్తులు కొనుగోలు చేసి, వాటిని ధరించి పొలాల్లో కాపాలా కాస్తున్నారు. ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో కోతులు సంచరిస్తున్నాయని, అయితే ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పంటలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంగా రైతులే రకరకాల మాయలతో కోతులను తరిమికొడుతున్నారు. అంతే కాకుండా కొంత మంది రైతులు పొలాల్లో ఎలుగు బంటి డ్రస్ వేసుకుని కాపలా గా ఉంటే రూ.250 కూలీ చెల్లిస్తున్నారు. స్థానిక రైతు గజేంద్ర సింగ్ మాట్లాడుతూఈ ప్రాంతంలో 40 నుంచి 45 కోతులు సంచరిస్తున్నాయి. ఈ కోతుల వల్ల చెరకు పంటలకు చాలా నష్టం వాటిల్లుతోంది. మేము కూడా పరిపాలనకు విజ్ఞప్తి చేసినప్పటికీ వినలేదు. ఇప్పుడు మేము మా పంటలను కాపాడుకోవడానికి విరాళాలు అందించి 4000 రూపాయలకు ఈ దుస్తులను కొనుగోలు చేసాం. ఇలా కోతుల మధ్య వేషం వేసుకుని కూర్చోవడం ప్రమాదకరం.. కానీ రైతులు నిస్సహాయంగా మారారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా చెరకు సాగుకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెద్ద ఎత్తున చెరకు సాగు చేస్తుండగా, కోతుల బెడదతో రైతుల పంటలు భారీగా నష్టపోతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)