కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతించిన ఉద్యోగులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలకు, ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఇవాళ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించి మొత్తం ఐదు అంశాలపై ఇవాళ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేబినెట్ నిర్ణయాలపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పందించింది. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్ని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి స్వాగతించారు. ఉద్యోగులకు సంబంధించిన 5 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. డీఏ జీవోలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ ఆర్ ఏ  అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణకు నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పుడు జగన్ మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులను న్యాయం చేశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.కాంట్రాక్టు ఉద్యోగుల తరపున ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్త పీఆర్సీ కమిషన్ వేసేందుకు కేబినెట్ నిర్ణయం పైనా కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పీఆర్సీ,,ఉద్యోగి కాంట్రిబ్యూషన్ మినహా పాత పెన్షన్ విధానంలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే మరిన్ని ప్రయోజనాలు ఇచ్చేలా సీఎం ముందుకెళ్తారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆయా అంశాలపై తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని, దీని ఫలితంగా ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయాలు తీసుకుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)