కేంద్రం ముందు 5 డిమాండ్లు

Telugu Lo Computer
0


భారత రెజ్లింగ్ ఫేడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన బుధవారంనాడు మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు రెజర్లు బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్ సుమారు ఆరు గంటల సేపు ఢిల్లీలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇక ఇదే సమావేవంలో 5 డిమాండ్లతో కూడిన లిఖిత పూర్వక ప్రతిపాదనను మంత్రికి రెజ్లర్లు సమర్పించారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి అనురాగ్.. ఈనెల 15వ తేదీతో దర్యాప్తు పూర్తవుతుందని, అంతవరకూ వేచిచూడాలని కేంద్రం రెజ్లర్లను కోరారు. మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచారు. 1. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయడం  2. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించడం, 3. సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించకుండా ఉండడం  4. రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాలక మండలికి ఎన్నికలు నిర్వహించాలి, 5. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతల కారణంగా తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలి. ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వానికి రెజ్లర్లు లిఖితపూర్వకంగా ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)