డిసెంబర్‌ నాటికి నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ రెడీ !

Telugu Lo Computer
0


నవీ ముంబై లో నిర్మించబోయే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 చివరికల్లా సిద్ధం కానుంది. దేశంలో ఏ నగరంలోనూ రెండు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు ఇప్పటిదాకా లేవు. ముంబైలో ఇప్పటికే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉంది. అయితే విమానాల తాకిడి అత్యధికంగా ఉండడంతోనే ఈ కొత్త ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఎన్‌ఎంఐఏను నిర్మించబోయేది అదానీ గ్రూప్‌. ఇందుకు చేయబోయే ఖర్చు 16 వేల కోట్ల రూపాయలు. ఈ ఎయిర్‌పోర్టు ద్వారా పదివేల ఉద్యోగాలను కల్పించనున్నారు. దాదాపు మూడు వేల ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించబోతున్నారు. నవీ ముంబై ఉల్వే తాలుకాలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. నాలుగు టెర్మినల్స్‌, రెండు రన్‌వేలు 29 కిలోమీటర్ల ముంబై ఎలివేటెడ్‌ రోడ్‌ ఈ ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానం కానుంది డిసెంబర్‌ 2024 కల్లా ఈ ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటిదాకా దేశంలో 35 ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు ఉండగా, 30 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు వాడుకలో ఉన్నాయి. నేవీ ముంబై ఎయిర్‌పోర్టుతో కలిసి కొత్తగా మరో 14 అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)