కేరళలో ట్రాన్స్‌జెండర్లకు 'ప్రైడ్‌' ప్రాజెక్టు !

Telugu Lo Computer
0


ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించేందుకు 'గౌరవం' పేరుతో కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 'ప్రైడ్‌' ప్రాజెక్టు ద్వారా ట్రాన్స్‌జెండర్లకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత నాలెడ్జ్‌ ఎకానమీ మిషన్‌, సామాజిక న్యాయ శాఖ సంయుక్త నిర్వహణలో ఈ 'ప్రైడ్‌' ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2026 నాటికి 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ దిశగా వివిధ వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్న సంగతి విదితమే. ప్రైడ్‌ కూడా ఇందులో భాగంగానే రూపొందించారు. ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో అందరితో పాటే సమాన గౌరవం దక్కాలనే ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించినట్లు విజయన్‌ తెలిపారు. 'ఉపాధి కోసం ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ ప్రైడ్‌ ప్రాజెక్టు పరిష్కారం చూపుతుంది. సమాజంలో మంచి ఉపాధి అవకాశాలు పొందాలనే ట్రాన్స్‌జెండర్ల ఆకాంక్షను ఈ పథకం సాకారం చేస్తుంది' అని విజయన్‌ పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ల సామాజిక తరగతి అభ్యున్నతికి కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఎంతో దోహదం చేస్తుందని సిపిఎం అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ అధికారిక పేజీల్లో ఆ పార్టీ పోస్టు చేసింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)