కేరళలో విస్తారంగా వర్షాలు !

Telugu Lo Computer
0


కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాలు జూన్ 8న కేరళకు చేరుకున్నాయి. జూన్ 9న రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు, శని, ఆది, సోమవారాల్లో ఐదు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు బిపార్జాయ్ తుఫాన్ అరేబియా సముద్రంలో తీవ్రరూపం దాల్చుతోంది. దీని కారణంగా ఈ ఏడాది రుతువవనాల రాక కాస్త ఆలస్యం అయింది. సాధారణం జూలై 1న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ముందుగా ఐఎండీ జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. అయితే వారం ఆలస్యంగా జూన్ 8న రుతుపవనాలు చేరాయి. రానున్న కొన్ని రోజుల్లో కేరళ, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 15 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ సారి ఎల్ నినో ఏర్పడినప్పటికీ, దేశంలో సాధారణ వర్షపాతమే అంటుందని ఐఎండీ తెలిపింది. సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన ఏడాది వర్షపాతం తగ్గుతుంది. చాలా సందర్భాల్లో ఇలానే జరిగింది. కానీ ఈ సారి ఎల్ నినో తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో భారత్ అంతటా సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)