ఒక్కో స్టేడియానికి రూ.50 కోట్లు బీసీసీఐ మంజూరు !

Telugu Lo Computer
0


బీసీసీఐ ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్వహణలో సమస్యలు తలెత్తకుండా, సౌకర్యాల కల్పనలో ఆటంకాలు రాకుండా ముందుస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ మ్యాచ్ లు జరగనున్న 10 వేదికలకు ఒక్కో స్టేడియానికి రూ.50 కోట్లు కేటాయించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పూణే, హైదరాబాద్, ధర్మశాల, గౌహతి మరియు తిరువనంతపురం స్టేడియాలకు ఇప్పటికే ఆ నిధులను మంజూరు చేసినట్లు సమాచారం. ఈ నిధులతో స్టేడియాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించబోతున్నారు. మౌళిక సదుపాయాల నిర్మాణంతో పాటు మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయనున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో కొన్ని స్టేడియాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం పట్ల బీసీసీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పలు వేదికలలో సరైన సిట్టింగ్ సౌకర్యాలు లేకపోవడంతో పాటు ఫ్లడ్ లైట్స్ సరిగ్గా వెలగలేదు. వీటికి తోడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిన నరేంద్ర మోడీ స్టేడియాన్ని వర్షం ముంచెత్తితే.. పిచ్‌ని కప్పి ఉంచేందుకు సరైన కవర్లు కూడా లేకపోవడం బీసీసీఐ అసమర్ధతను ఎత్తిచూపింది. దీంతో బీసీసీఐ గడిస్తోన్న వేల కోట్ల లాభాలు ఎటుపోతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే అలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా ఉండేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)