4న కేరళలో రుతుపవనాల ఆగమనం

Telugu Lo Computer
0


నైరుతి రుతుపవనాలు గురువారం మాల్దీవులు, కొమరిన్, ఆగ్రేయ, అరేబియా సముద్రం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించాయి. రానున్న రెండో రోజుల్లో ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 4న కేరళలో ప్రవేశిస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఒక రోజు ముందుగానే ఈ నెల 3వ తేదీన కేరళను తాకవచ్చంటూ మరి కొందరు నిపుణలు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 5న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల అవర్తనం ఏర్పడుతుందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో అప్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 7, 8 తేదీల్లో రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు నుంచి మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నది. శుక్ర, శనివారాల్లో ఎండల తీవ్రత పెరగనున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. రాయల సీమ ప్రాంతంలో గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలు, నంద్యాల, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పిడుగులు పడి నలుగురు మరణించారు. తిరుపతి గోవింద రాజస్వామి ఆలయ ఆవరణలో భారీ చెట్టు పడి ఒక వైద్యుడు దుర్మరణం పాలయ్యారు. అదే సమయంలో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. మూడు రోజుల పాటు 302 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శుక్ర, శనివారం రెండురోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు:రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బలహీనపడి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.రాబోయే మూడు రోజులు గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉదయం 7 గంటల నుంచే వేడి గాలులు మొదలయ్యాయి. ఎండ, వేడి గాలుల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, సీమ జిల్లాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)