25 మంది ఆఫ్రికా జాతీయుల అరెస్టు

Telugu Lo Computer
0


బెంగళూర్ లో పోలీస్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో 25 మంది ఆఫ్రికా జాతీయులను అరెస్ట్ చేశారు. ఇందులో స్త్రీలు, పురుషులు ఉన్నారు. ఇద్దరిని నార్కోటిక్స్ పరీక్షలకు పంపారు. బెంగళూర్ పోలీసులు శనివారం అర్థరాత్రి ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చి స్ట్రీట్ లో ఆకస్మికంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతోనే సెంట్రల్ డివిజన్ పోలీసులు దాడులు చేశారు. సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస గౌడ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఒక డీసీపీ, ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, 6 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, 20 మంది మహిళా సిబ్బంది, 20 మంది ఇతర సిబ్బంది ఈ ఆపరేషన్‌లో విజయవంతంగా నిర్వహించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ ఉల్లంఘించినందుకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ గౌడ తెలిపారు. ఒక మహిళపై ఐపీసీ సెక్షన్ 353(ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఇద్దరి వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఎక్కువ మందిపై డ్రగ్స్ తీసుకున్నందుకు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు డ్రగ్స్ వినియోగం, అమ్మకాలకు పాల్పడుతున్నందుకు దాడులు నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. 25 మంది ఆఫ్రికన్లతో సహా ఒక భారతీయుడు మొత్తం 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)