ఉచిత బస్సు ప్రయాణం 20 కిలోమీటర్లే !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (శక్తి యోజన) జూన్ 11వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పథకం అన్ని కులాలు, మతాలు, తరగతులకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూడాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మంత్రులు శాసనసభ్యులను ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించనున్న ఈ పథకంలోని అసలు విషయాన్ని తాజాగా వెల్లడించారు. వాస్తవానికి ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు. ఈ విషయమై సిద్ధరామయ్య మాట్లాడుతూ ''ఐదు గ్యారంటీ హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించబోతున్నాం. అయితే ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏసీ బస్సులు, వోల్వోల్లో ఈ ప్రయాణ సౌకర్యం ఉండదు అలాగే 20 కిలోమీటర్ల పరిమితి వరకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుంది. ఉదహారణకు తిరుపతి వెళ్లనుకునే వారు బుల్బాఘల్ నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ (కోలార్ సరిహద్దు) వరకు మాత్రమే ఉచిత ప్రయాణం లభిస్తుంది. ఆ తర్వాత ప్రయాణానికి డబ్బులు చెల్లించాలి'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)