'మియాజాకి' మామిడి పళ్లు కిలో రూ.2.75 లక్షలు !

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌ సిలిగురిలో ఏర్పాటు చేసిన ఫ్రూట్ ఫెస్టివల్లో 'మియాజాకి' మామిడి పండ్లు సందడి చేశాయి. ఈ ఫెస్టివల్‌లో 262 రకాల మామిడి పండ్లను ప్రదర్శించగా 'మియాజాకి' మాత్రమే ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏఎన్ఐ అందించిన కథనాలు ప్రకారం ఈ మామిడి పళ్లు ధర కిలో రూ.2.75 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ పండ్లకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీటిని జపాన్‌లోని మియాజాకి పట్టణంలో ఎక్కువగా పండిస్తారు. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో కూడా లభిస్తున్నాయి. అక్కడ పండిన మామిడి పళ్లును ఓ రైతు ఫెస్టివల్‌కు తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పళ్లు ఇవి. వీటిలో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పుష్కలంగా ఉండడంతో వీటి ధర భారీగా ఉంటోంది. మియాజాకి మామిడితో క్యాన్సర్ రిస్క్‌ కూడా తగ్గుతుందట!.

Post a Comment

0Comments

Post a Comment (0)