చాయ్ జీపీటీ (Cenunely puru tea) !

Telugu Lo Computer
0


ట్రెండ్ కు తగినట్లుగా వ్యాపారం మారిపోతుండాలి. మనిషి తన తెలివితేటలతో రూపొందించిన టెక్నాలజీ మనిషిని ఎలా నడిపిస్తుందో … ట్రెండ్ ను అందిపుచ్చుకుని వ్యాపారులు కష్టమర్లను ఆకట్టుకుంటుండాలి. దానికి మొదటి అడుగు 'పేరు'. పేరు చాలా ముఖ్యం.వ్యాపారం అంటూ ఓ షాపు ఉంటుంది. లేదా ఓ ఆఫీసు ఉంటుంది. వాటి 'పేర్లు' ట్రెండ్ కు తగినట్లుగా ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆహారాలు,పానీయాలకు సంబంధించిన షాపులకు 'పేర్లు' సృజనాత్మకత చాలా చాలా ముఖ్యం.. క్రియేటివిటీ ఉండాలే కానీ సక్సెస్‌ దానంతటదే వస్తుందనే ఈరోజుల్లో ఉన్నత చదువులు చదివి చిరువ్యాపారాలతో ట్రెండ్ అయిపోతున్నారు యువత. సరిగా అదే ఆలోచించాడో ఓ చాయ్ వాలా. వినూత్నంగా తన షాపుకు పేరు పెట్టాడు. ట్రెండ్ కు తగినట్లే కాదు ఏకంగా టెక్నాలజీకి తగినట్లుగా పెట్టాడు పేరు. ChatGPT అనేమాట ఇటీవల బాగా వినిపిస్తోంది. అందుకే తన టీ షాపుకు 'చాయ్ జీపీటీ' (Chai GPT)అని పేరు పెట్టాడు..!  గ్రాడ్యుయేట్‌ చాయ్‌ దుకాణాలను తలదన్నేలా ఉంది కదూ పేరు..ఈ పేరు వింటే ఈ చాయ్ వాలా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతాడనుకుంటా..అనిపిస్తోంది తన చాయ్‌ దుకాణానికి 'చాయ్‌ జీపీటీ' అంటూ వినూత్నంగా పేరు పెట్టటం చూస్తే..ఈ 'చాయ్‌ జీపీటీ' చాయ్ షాప్ పోస్ట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇటీవల మనం చాట్ జీపీటీ గురించి తెగ వింటున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్ ఇది. ఏ సమాచారం కోరినా క్షణాల్లో మనముందుంచే టక్కులాడీ ఈ ChatGPT. గూగుల్ సెర్చ్ కంటే సమర్థవంతమైన ఈ నూతన టెక్నాలజీ ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇదిగో ఆ చాయ్ వాలా ఈ చాట్‌జీపీటీని తన వ్యాపారానికి వాడేసుకున్నాడు. యూనిక్ పేరు భయ్యా అని తెగ ట్రెండ్ అయిపోతున్నాడు. చాట్‌జీపీటీ సబ్ టైటిల్ గా Cenunely puru tea అని పెట్టాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)