అంతర్జాతీయ క్రెడిట్ కార్డు చెల్లింపులకు 20% టీసీఎస్ పెంపు !

Telugu Lo Computer
0


మన దేశం నుంచి విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణం మరింత భారంగా మారబోతోంది. ఇప్పటికే కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా బడ్జెట్ లో ప్రకటించిన విధంగా టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) ను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచబోతోంది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలే కాదు క్రెడిట్ కార్డు లావాదేవీలపైనా ప్రభావం పడబోతోంది. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ ప్రయాణాల బుకింగ్స్ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో జూలై 1 నుంచి కేంద్రం టీసీఎస్ ను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుతుండటంతో విదేశాలకు వెళ్లేవారు ఇప్పుడే పరుగులు తీస్తున్నారు. తాజా పన్ను పెంపు అమల్లోకి వస్తే విమాన ప్రయాణానికి రూ. 50,000 ఖర్చవుతున్నట్లయితే దీనిపై టీసీఎస్ మొత్తం రూ. 10,000 అవుతుంది. అంటే ఇది విమాన ప్రయాణ ఖర్చులో 20 శాతానికి సమానం అన్నమాట. మే 16న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం విదేశీ టూర్ ప్యాకేజీలోత పాటు అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ లావాదేవీలపై 20 శాతం టీసీఎస్ నిబంధన వర్తించబోతోంది. అంటే నేరుగా క్రెడిట్ కార్డుల ద్వారా చేసుకునే బుకింగ్ కూడా 20 శాతం టీసీఎస్ పరిధిలోకి వస్తుంది. విదేశీ ప్రయాణ బుకింగ్‌లతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులపై టీసీఎస్ పెంపు రేటు జూలై 1 నుంచి 5 శాతం నుండి 20 శాతానికి నాలుగు రెట్లు పెరగడానికి సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఎల్ఆర్ఎస్ చెల్లింపులపై టీఎసీఎస్ ను 2020 అక్టోబర్ లో తొలిసారి 5 శాతం విధించారు. దీంతో ఇప్పటికే దేశీయ ట్రావెల్, టూర్ ఏజెంట్ల వ్యాపారాలకు తీవ్ర నష్టం కలిగింది. ఇప్పుడు దీన్ని 20 శాతానికి పెంచుతుండటంతో వీరికి చుక్కలు కనిపించడం ఖాయం. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ వాడుకోవడం ద్వారా విదేశాలలో పెట్టుబడులు, ఖర్చులు చేస్తారు. ఇది భారతీయులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి లావాదేవీల కోసం ఓ వ్యక్తి ఆర్థిక సంవత్సరానికి 2.5 లక్షల డాలర్ల వరకు చెల్లింపు చేయవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)