నా కల నిజమైన వేళ !

Telugu Lo Computer
0


సంగీత దర్శకుడు తమన్‌కు క్రికెట్‌ అంటే బాగా ఆసక్తి. ఇటీవలే సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లోనూ తెలుగు వారియర్స్‌ తరఫున మ్యాచ్‌లు ఆడి తనలోనూ ఓ క్రికెటర్‌ ఉన్నాడని నిరూపించుకున్నాడు. తాజాగా తాను ఎంతగానో అభిమానించే క్రికెటర్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని కలిశాడు. ఆయనతో సరదాగా సెల్ఫీ కూడా దిగాడు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. మై మ్యాన్‌.. మై క్రికెట్‌ గాడ్‌.. మన ఎస్‌ ధోనీ.. నా కల నిజమైన వేళ.. నా హృదయం ఆనందంతో ఉరకలు వేస్తోంది.. అంటూ ధోనీతో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. మీ మిలియన్ల మంది వీరాభిమానుల్లో ఒకరైన (తమన్‌) అభిమానిని హ్యాపీగా ఉంచిన ప్రియమైన ఎంఎస్‌ ధోనీకి ధన్యవాదాలు.. నా కల నెరవేరేందుకు సహకరించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు' అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు థమన్‌. ప్రస్తుతం ధోని, థమన్‌ కలిసున్న ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి అటు క్రికెట్‌ లవర్స్‌, ఇటు మ్యూజిక్‌ లవర్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)