ప్రచారానికి దాఖలు చేసిన దావాలా ఉంది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 16 May 2023

ప్రచారానికి దాఖలు చేసిన దావాలా ఉంది !


తమ పేరు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలను పెట్టుకోవాలని ఏ మహిళనూ అడగకూడదని, ఈ మేరకు ఆదేశాలివ్వాలని దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది ప్రచారానికి దాఖలు చేసిన దావాలా కనిపిస్తోందని పేర్కొంది. ''మీరు మా నుంచి ఏ ఊరట కోరుకుంటున్నారు. ప్రచారానికి వేసినట్లు ఉంది. కుమారి, శ్రీమతి లాంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోవాలని మహిళను అడగకూడదని మీరు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా వాడాలనుకుంటే వారినెలా నిరోధిస్తారు. ఇందుకొక సాధారణ పద్ధతి అంటూ లేదు. పేరుకు ముందు ఆ పదాలను వాడాలా లేదా అన్నది ఆ వ్యక్తి ఎంపికననుసరించి ఉంటుంది'' అంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.

No comments:

Post a Comment