ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు మొదటిసారి ఇచ్చిన కాంగ్రెస్

Telugu Lo Computer
0


ఆమ్ ఆద్మీ పార్టీతో ఉప్పునిప్పుగానే ఉండే కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆప్ స్థాపించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించడం ఇదే మొదటిసారి. అయితే ఈ మద్దతు ప్రత్యక్షంగా దొరికింది కాదు. భారతీయ జనతా పార్టీతో కొంత కాలంగా ఆప్ ఢీ అంటే ఢీ అన్నట్లు వెళ్తోంది. బీజేపీని తగ్గించేందుకు ఆప్ ‭కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లు చేసేందుకు ఎల్‌జీకి అధికారం కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతును గుప్పిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్ణయించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపిన ఒక రోజు అనంతరం ఆప్ ‭కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. సోమవారం ఢిల్లీలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ‭తో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను 'రాజ్యాంగ వ్యతిరేకం'గా అభివర్ణించారు. ''ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలను ఎలా లాక్కోవాలి? ఇది రాజ్యాంగ విరుద్ధం. అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా నిలుస్తాం. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని దీనికి ముందు బీహార్ సీఎం అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)