మోడీకి బైడెన్‌ ఆత్మీయ ఆలింగనం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 20 May 2023

మోడీకి బైడెన్‌ ఆత్మీయ ఆలింగనం !


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం జపాన్‌లోని హిరోషిమాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే ప్రతిష్ఠాత్మక జీ-7 దేశాల సదస్సులో మోడీ పాల్గొంటున్నారు. ఈ సమ్మిట్‌లో భారత్‌, జపాన్‌లతో పాటు అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఇండోనేసియా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల అధినేతలు ఈ జీ-7 సదస్సుకు హాజరయ్యారు. కాగా జీ-7 సదస్సులో భాగంగా ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మంత్రి మోడీని పలకరించేందుకు స్వయంగా మోడీ ఉన్న వేదిక దగ్గరకు అమెరికా అధ్యక్షులు బైడెన్‌ వచ్చారు. దీనిని గమనించి మోడీ కూడా లేచి బైడెన్‌ను పలకరించారు. ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే ప్రఖ్యాత జపనీస్ రచయిత, హిందీ, పంజాబీ భాషావేత్త, పద్మశ్రీ డాక్టర్ టోమియో మిజోకామి, ప్రముఖ జపనీస్ చిత్రకారుడు హిరోకో తకయామాతో  మోడీ సమావేశమయ్యారు. ప్రొఫెసర్ టోమియో మిజోకామి, హిరోకో తకయామాను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అంతకుముందు హిరోషిమా పట్టణంలో జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి మోడీ. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దొరకడం తన అదృష్టమన్నారు . హిరోషిమా అనే పదం వింటేనే ఇప్పటికీ ప్రపంచం భయపడుతోందన్నారు. తాను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటారని తెలిసి హర్షం వ్యక్తం చేశారాయన. ఇక్కడి మహాత్మాగాంధీ విగ్రహం అహింసా సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని మోడీ ఆకాంక్షించారు.

No comments:

Post a Comment