బరువు తగ్గించడానికి నాన్-షుగర్ స్వీటెనర్ ను తీసుకోవద్దు !

Telugu Lo Computer
0


అనారోగ్యకరంగా భావించే బరువు పెరుగుదలను నివారించడానికి, నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి నాన్-షుగర్ స్వీటెనర్స్ ను తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ఇచ్చింది. అస్పర్టమే, నియోటేమ్, సాచరిన్, స్టెవియా, సుక్రలోజ్, సైక్లేమేట్స్ వంటి వివిధ చక్కెర రహిత స్వీటెనర్‌లను ప్యాక్ చేసిన ఆహారం, పానీయాలలో ఉపయోగిస్తారు. ఈ స్వీటెనర్లను సాధారణంగా విడిగా విక్రయిస్తారు. అంతే కాదు వీటిని చక్కెర ప్రత్యామ్నాయాలుగానూ ఉపయోగిస్తారు. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయని, బరువును తగ్గించడంలో సహాయపడతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. డబ్ల్యూహెచ్వో తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పెద్దలు, పిల్లలకు బరువు నియంత్రణలో నాన్-షుగర్ స్వీటెనర్లు ఎటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించవు. బదులుగా, అటువంటి ఎన్ఎస్ఎస్ ఉపయోగం టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, పెద్దలలో మరణాల ప్రమాదంతో సహా "అవాంఛనీయ ప్రభావాలకు" దారి తీస్తుంది. ఫ్రీ షుగర్స్ చక్కెరలను ఎన్ఎస్ఎస్ తో భర్తీ చేయడం అనేది దీర్ఘకాలంలో బరువు నియంత్రణలో సహాయపడదు. పండ్లు, లేదా తియ్యని ఆహారం, పానీయాలు వంటి సహజంగా లభించే చక్కెరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువును నియంత్రించవచ్చు'అని డబ్ల్యూహెచ్ఓ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బ్రాంకా అన్నారు. ఇందులో ఎలాంటి పోషక విలువలుండవని, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రారంభంలోనే ఆహారం తక్కువగా తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మినహా అందరికీ ఈ సిఫార్సు వర్తిస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వ్యక్తిగత సంరక్షణ, మందులు, చర్మపు క్రీమ్‌లు వంటి పరిశుభ్రత ఉత్పత్తులలో కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ను ఉపయోగించవచ్చని ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. తక్కువ కేలరీల చక్కెరలు, చక్కెర ఆల్కహాల్‌లకు కూడా ఈ సిఫార్సు వర్తించదు.

Post a Comment

0Comments

Post a Comment (0)