అక్రమ సంబంధం ప్రాణం తీసింది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 6 May 2023

అక్రమ సంబంధం ప్రాణం తీసింది !


కేరళలోని పరక్కడవు పరిధిలోని అంగమాలీలో అతిర అనే మహిళ నివాసం ఉండేది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతిర అంగమలీలోని ఓ సూపర్‌మార్కెట్‌లో పనికి కుదిరింది. పని చేసే చోట ఆమెకు అఖిల్ అనే పెళ్లైన యువకుడు పరిచయమయ్యాడు. వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా మారిపోయింది. ఈ క్రమంలో అఖిల్ డబ్బులు కావాలని ప్రియురాలిని అడిగాడు. ప్రియుడిపై ప్రేమతో 12 తులాల బంగారం కుదవబెట్టి అతిర ప్రియుడికి డబ్బులు ఇచ్చింది. అలా కొన్ని నెలలు గడిచింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తే బంగారం తెచ్చుకుంటా అంటూ ప్రియుడికి చెప్పింది. ప్రియుడు మాత్రం రేపు, మాపు అంటూ కాలాన్ని నెట్టుకొచ్చాడు. ఇక రోజు రోజుకు అతిర డబ్బు ఇవ్వాలంటూ టార్చర్ పెట్టింది. ఈ క్రమంలోనే అఖిల్ ప్రియురాలిని చంపాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 29న ఇద్దరూ సూపర్ మార్కెట్ కు డుమ్మా కొట్టి పర్యాటక ప్రాంతమైన త్రిస్సుర్ జిల్లాలోని అతిరపల్లికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక అఖిల్ ప్రియురాలిని నమ్మించి అడవిలోకి తీసుకెళ్లాడు. కొద్ది దూరం వెళ్లాక అఖిల్ రాయితో కొట్టి అతిరను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఏప్రిల్ 29 నుంచి అతిర కనిపించకపోవడంతో ఆమె భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆమె పని చేసే సూపర్ మార్కెట్ లో అడగగా ఆ రోజు అతిరతో పాటు అఖిల్ కూడా పనికి రాలేదని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అఖిల్ అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో నాకేం తెలియదన్నట్లుగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇక పోలీసుల స్టైల్ లో విచారించే సరికి వీరి వివాహేతర సంబంధం బయటపడింది. చివరికి నేనే హత్య చేశానంటూ అఖిల్ నేరాన్ని కూడా అంగీకరించాడు. అతిర వద్ద అప్పు తీసుకున్నానని, తరుచు అడగడంతో హత్య చేశానంటూ ఒప్పుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అఖిల్ ను అరెస్ట్ చేశారు. 

No comments:

Post a Comment