నితిన్‌ గడ్కరీకి మళ్లీ బెదిరింపు కాల్‌ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 16 May 2023

నితిన్‌ గడ్కరీకి మళ్లీ బెదిరింపు కాల్‌ !


బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీలోని గడ్కరీ నివాసానికి ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంత్రి కార్యాలయం నుంచి నితిన్‌ గడ్కరీకి ప్రాణహాని ఉన్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివరాల ఆధారంగా ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాది ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో, మహారాష్ట్రలోని అతని నివాసం, కార్యాలయానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment