గాఢ నిద్ర తక్కువైతే మెదడు ఆరోగ్యానికి దెబ్బ !

Telugu Lo Computer
0


నిద్రలో శ్వాస కష్టమవడం, గాఢ నిద్ర తక్కువవడం వంటి సమస్యల వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని తాజా అధ్యయనంలో అమెరికా పరిశోధకులు గుర్తించారు. అలాంటి వ్యక్తుల్లో పక్షవాతం, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుందని పేర్కొన్నారు. మేధో సామర్థ్యాలు వేగంగా క్షీణిస్తాయని తెలిపారు. మొత్తం 140 మందిపై (వీరి సగటు వయసు 73 ఏళ్లు) వారు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గాఢ నిద్రలో తక్కువ సమయం ఉండేవారితోపాటు నిద్రలో ఊపిరి కష్టమయ్యే వ్యక్తుల్లో వైట్‌మ్యాటర్‌ హైపర్‌ఇంటెన్సిటీస్‌ అనే ప్రత్యేక పరిస్థితిని గుర్తించారు. వారి మెదడు స్కాన్లలో స్వల్ప గాయాల వంటివి కనిపించినట్లు పేర్కొన్నారు. ఆయా వ్యక్తుల్లో నాడీకణాల అనుసంధానత సంబంధిత సమస్యలు తలెత్తే ముప్పు కూడా ఎక్కువగా ఉందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)