68 మంది జడ్జిల ప్రమోషన్లపై సుప్రీం స్టే !

Telugu Lo Computer
0


గుజరాత్లో జడ్జీల పదోన్నతులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వీరిలో పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జి హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ సహా 68మంది ఉన్నారు. వీరి పదోన్నతి చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. తుది విచారణను 2023 ఆగస్టు 8కి వాయిదా వేసింది. 68 మంది న్యాయమూర్తులను జిల్లా జడ్జీ కేడర్‌కు ప్రమోట్‌ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్‌ హైకోర్టు జాబితాను జారీ చేసింది. ఈ జాబితాను సవాల్‌ చేస్తూ ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 'మెరిట్- కమ్- సీనియారిటీ' ఆధారంగా కాకుండా.. 'సీనియారిటీ కమ్ మెరిట్‌' ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గుజరాత్‌ ప్రభుత్వం, గుజరాత్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ.. గుజరాత్‌ ప్రభుత్వం ఆ న్యాయమూర్తులకు ప్రమోషన్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై తాజాగా మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. గుజరాత్‌ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిసి కూడా ప్రభుత్వం వారికి పదోన్నతి కల్పించడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది. పదోన్నతి దక్కిన న్యాయమూర్తులు తిరిగి వారి గత స్థానాల్లోకి వెళ్లిపోవాలని కోర్టు సూచించింది. దీనిపై తగిన ధర్మాసనం తదుపరి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)