నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా

Telugu Lo Computer
0


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో తన జీవితకథను విడుదల చేస్తూ.. 'నేను ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను' అని ప్రకటించారు. నేనెప్పుడూ మీ వెంటే ఉంటానని పవార్ తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శరద్ పవార్ తన వారసుడి పేరును ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శరద్ తర్వాత పార్టీ అధిష్టానం ఎవరి చేతుల్లో ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్సీపీ రేసులో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో శరద్ కూతురు సుప్రియా సూలే, మేనల్లుడు అజిత్ పవార్ పేరు ముందు వరుసలో ఉంది. అయితే ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడిగా ఛగన్ భుజబల్, జయంత్ పాటిల్, ప్రఫుల్ పటేల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎన్సీపీలో ఆయన చాలా ప్రభావం చూపుతున్నారు. అయితే అజిత్ పవార్‌తో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2019లో కూడా పార్టీపై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అజిత్‌కి డిప్యూటీ సీఎం పదవి దక్కింది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా ఎన్‌సిపి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అజిత్ పవార్, సుప్రియా సూలే మధ్య పోరు సాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుప్రియ ఎన్సీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు. ఆమెకు మద్దతుగా చాలా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆమె ఒకరు.

Post a Comment

0Comments

Post a Comment (0)