కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు !

Telugu Lo Computer
0

కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మానిఫెస్టోలో భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. పీఎఫ్ఐతో పాటు భజరంగ్ దళ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హమీని మదానీ సమర్థించారు. ఇది 70 ఏళ్ల క్రితమే తీసుకోవాల్సిన చర్యగా అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మదానీపై తీవ్రంగా మండిపడ్డారు. విభజన సమయంలోనే ముస్లింలందరినీ పాకిస్తాన్ కు పంపించి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించారు. బీహార్ లోని బెగుసరాయ్ లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ మన పూర్వీకులు చేసిన తప్పు వల్ల ముస్లింలు ఉన్నారని అప్పుడే వారందరిని పాకిస్తాన్ పంపితే  మదానీ, అసదుద్దీన్ ఓవైసీ వంటి వారితో పోరాడాల్సిన అవసరం ఉండేది కాదని, భారతదేశంపై 'గజ్వా-ఎ-హింద్' ముప్పు ఉండకపోయేదని ఆయన అన్నారు. టిప్పు సుల్తాన్ ఒక ఆక్రమణదారుడు. అతను భారత సంపద దోచుకోవడానికి ఈ గడ్డపై కాలు మోపాడని, బ్రిటిష్ వారిపై ఆయన చేసిన పోరాటం స్వాతంత్ర పోరాటం కాదని, తన సొంత రాజ్యాన్ని కాపాడుకునే లక్ష్యమని గిరిరాజ్ సింగ్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)