అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో భారీగా నగదు స్వాధీనం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 14 May 2023

అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో భారీగా నగదు స్వాధీనం !


సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్‌ బజార్‌లో ఓ ఇంట్లో శనివారం రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి మంటలను ఆర్పేసింది. అయితే అనంతరం వచ్చిన పోలీసులు ఇంట్లో తనిఖీలు చేపట్టారు.  అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. బెడ్‌ రూమ్‌లో ఏకంగా రూ. 4.61 కోట్ల డబ్బు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బును గుర్తించిన పోలీసులు సీజ్‌ చేశారు. ప్రమాదం జరిగిన ఇంటి యజమాని శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇతను ఓ ప్రముఖ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నాడు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో లేడు. అయితే ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకొని ఆగమేఘాల మీద వచ్చిన శ్రీనివాస్‌ ఇంట్లో ఉన్న డబ్బును తనిఖీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శ్రీనివాస్‌ డీజీఎంగా పనిచేస్తుండగా అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ బిజినెస్‌ కూడా చేస్తున్నాడు. ఇంత మొత్తం ఇంట్లో ఎందుకు ఉందన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. నగదును సీజ్‌ చేసి స్టేషన్‌కి తరలించారు. ఈ డబ్బును హవాల మనీగా పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయితే కానీ అన్ని వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు.

No comments:

Post a Comment